calender_icon.png 19 February, 2026 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొలెరో వాహనం బోల్తా.. పలువురికి గాయాలు

13-12-2025 09:49:41 AM

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడి 18 మంది గాయాపడ్డారు. వివరాల్లోకి వెళితే... వరినాట్లు వేసేందుకు కూలీలు మహారాష్ట్ర నుంచి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు బయలుదేరారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వద్దకు రాగానే ఒక్కసారిగా  బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 18 మంది వలస కూలీలకు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.