అలీ ముఖ్యపాత్రలో బాలీవుడ్ చిత్రం
టాలీవుడ్ నటుడు అలీ భారతదేశంలోని అన్ని భాషల్లోనూ తనదైన శైలిలో నటించి మెప్పించిన నటుడిగా గుర్తింపు పొందారు! అలీ ప్రధాన పాత్రలో తాజాగా ఓ బాలీవుడ్ చిత్రం రూపొందుతోంది. మ్యాడ్ ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆశిశ్‌కుమార్ దూబే రచించి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమానే ‘వెల్‌కమ్ టు ఆగ్రా’. అలీతోపాటు ఇంకా ఈ చిత్రంలో అనుషమాన్‌ఝా, సారా అంజలి, ఆకాశ్ ధబాడే, రౌనక్ ఖాన్, ఫైజల్ మాలిక్, అంచల్ గాంధీ, కైరా చౌదరి తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా ముహూర్తపు సన్నివేశాల్ని ముంబైలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా నటుడు అలీ మాట్లాడుతూ.. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా కేంద్రంగా జరిగే ప్రేమకథ ఇది. ఈ సినిమాలో మెయిన్ రోల్‌లో నన్ను ఎన్నుకున్నందుకు నిర్మాతకు, దర్శకుడికి నా కృతజ్ఞతలు. గతంలో అనేక సినిమాల్లో సల్మాన్‌ఖాన్ వంటి అనేక మంది హీరోల పక్కన క్యారెక్టర్ యాక్టర్‌గా నటించాను. ఈ సినిమాలో ఫుల్‌లెంగ్త్ ఉన్న పాత్ర చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు.






