14 March, 2026 | 10:34 AM

కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

04-12-2025 12:00 AM

నాటుబాంబు కొరికిన సునకం మృతి 

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 3, (విజయక్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని భద్రాచలం రోడ్స్ రైల్వేస్టేషన్లో బుధవారం బాంబు కలకలం చెలరేగింది. మూడవ పట్టణ స్టేషన్ పరిధిలో గల రైల్వేస్టేషన్లో పట్టాలపై ఉన్న నాటు బాంబును వీధి శునకం కొరకడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సునకం అక్కడికక్కడే మృతి చెందడం, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది.

విషయం తెలుసుకున్న పోలీసు బలగాలు జాగిలాలతో ఆ ప్రాంతానికి చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ లోకి బాంబు ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనే కోణం నుంచి పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై ఎస్పీ రోహిత్ రాజ్ స్పందించి అటవీ జంతువుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులను తయారు చేశారని.

చెత్త పడవేసే ప్రాంతం నుంచి సునకం రైల్వే ట్రాక్ పైకి తినే ఆహారంగా భావించి కొరకటంతో ఈ ప్రమాదం సంభవించింది అన్నారు. ఏ ప్రమాదంలో శునకం మృతి చెందిందని. ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నామని ప్రజలు ఎలాంటి భయాందోళన గురి కావలసిన అవసరం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు.