calender_icon.png 3 December, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలను పక్కాగా అమలు చేయండి

03-12-2025 10:54:06 PM

ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి..

భూత్పూర్: జిల్లాలో మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. బుధవారం భూత్పూర్ మండలం అన్నా సాగర్ 1 క్లస్టర్ గ్రామ పంచాయతీలను తనిఖీ చేసి సర్పంచ్, వార్డ్ సభ్యుల, స్థానాలకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియను గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయని దేవి పరిశీలించారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా అమలయ్యేలా చూడాలని, నిర్నీత గడువులోపల నామినేషన్ లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చుల వివరాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.