17 April, 2026 | 5:22 AM

అమ్మవారికి బోనాల పండుగ

09-02-2026 12:00 AM

నిర్మల్, ఫిబ్రవరి ౮ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని  నకాష్ సంఘం ఆధ్వర్యంలో  ఆదివారం సారంగాపూర్ మండ లంలోని అడెల్లిలో మహా పోచమ్మ తల్లి ఆలయంలో వైభవంగా బోనాల వేడుకలను నిర్వహించారు. మహా పోచమ్మ నూతన ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాంపల్లి శివకుమార్ వర్మ, రాచర్ల నర్సయ్య వర్మ  ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.