8 May, 2026 | 1:01 PM

అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి

19-05-2024 12:00 AM

రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కళ్ళాల్లో వడ్లు తడుస్తూ వున్నాయి. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాని కి ధాన్యం తడిసి ముద్దయింది. మరో ఐదు రోజులు భారీ వర్షాలుంటాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అందువల్ల రైతులు మరింత నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్రంలో పండించే ధాన్యంలో 20 శాతం మాత్రమే సన్నబియ్యం రకం పండించే రైతులు. మిగతా80 శాతం దొడ్డు బియ్యం పండిస్తారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ వాగ్దానం చేసింది. ఇపుడు సన్న బియ్యం పండించే రైతులకు మాత్రమే బోనస్ వర్తిస్తుందనే వార్తలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా