8 May, 2026 | 1:54 PM

వాళ్లు కన్నబిడ్డలేనా?

19-05-2024 12:00 AM

సూర్యాపేట జిల్లాలో ఆస్తికోసం కన్నబిడ్డలు తల్లి అంత్యక్రియలు చేయకుండా రెండు రోజులు అలాగేఉంచేసిన వార్త దిగ్భ్రాంతి కలిగించింది.  నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి విషయంలోనే బిడ్డలు ఇలా ప్రవర్తిస్తే  రేపు వారి పిల్లలు కూడా అలాగే తయారవుతారేమో!ఆలోచించాలి.  ప్రేమాభిమానాలకన్నా ఆస్తులే ఎక్కువైన నేటి సమాజంలో  బిడ్డల కోసం తల్లిదండ్రులు కడుపు కట్టుకుని  ఎందుకు ఆస్తులు కూడబెట్టాలనే ప్రశ్న వస్తుంది. అందుకే కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోంది.  ఈ ఉదంతం తర్వాతనైనా అలాంటి వారిలో మార్పు వస్తే బాగుంటుంది.

 కోటేశ్వర రావు, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా