బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బి.ఆర్. అంబేద్కర్
నివాళులర్పించిన కలెక్టర్ ప్రతి మాసింగ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు
మెదక్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగు జాడలలో నడుస్తూ ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తాలో నిర్వహించగా, కలెక్టర్ ప్రతిమా సింగ్ , ఎస్పీడీ.వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగాడాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి డిఆర్డిఓ శ్రీనివాసరావు,
జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఎఫ్‌ఓ జోజి, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు ఆకుల పెంటయ్య, కమిటీ చైర్మన్ దుబాషి సంజీవ్ , వైస్ చైర్మన్ గరుగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, కార్యదర్శి నాగరాజు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






