14 July, 2026 | 1:03 PM

ఆన్‌లైన్ గేమ్‌లో గొడవ

27-06-2024 12:10 AM

ప్రత్యర్థిపై దాడి చేసేందుకు 750 కి.మీ ప్రయాణించిన గేమర్

న్యూఢిల్లీ, జూన్ 26: ఆన్‌లైన్ గేమ్స్‌ను తలకెక్కించకుని కొందరు వికృతాలకు పాల్పడుతున్నారు. స్థిమితాన్ని పోగొట్టుకుని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా అమెరికాలో వెలుగు చూసింది. ఆన్‌లైన్‌లో గేమ్‌లో ఆడుతుండగా ఓ యువకుడికి అవతలి గేమర్‌తో సమస్య వచ్చింది. దీంతో కోప్రోద్రిక్తుడైన యువకుడు దాడి చేసేందుకు ఏకంగా 750 కి.మీ ప్రయాణించాడు. నూజెర్సీకు చెంది న 20 ఏళ్ల ఎడ్వర్డ్ కాంగ్ ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా అవతలి వ్యక్తితో సమస్య వచ్చింది. దీంతో ఎడ్వర్డ్ న్యూజెర్సీ నుంచి ఫ్లోరిడా వరకు ప్రయాణించాడు. గేమర్ నివాసానికి వెళ్లి అతడిపై సుత్తితో దాడి చేశాడు. అతని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.