14 July, 2026 | 1:54 PM

కరాచీలో మరో కొత్త భయం

27-06-2024 12:05 AM

అనుమానాస్పదంగా 22 మృతదేహాలు

న్యూఢిల్లీ జూన్ 26: ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో మరో భయం మొదలైంది. ఆ దేశ ప్రధాన పట్టణమైన కరాచీలో 22 అనుమానాస్పద మృతదేహాలు కలకలం రేపాయి. ఈ మృతదేహాలు ఎవరివనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మృతదేహాలు వివిధ ప్రాంతాల్లో లభించినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. మంగళవారం రోజు కూడా అనుమానాస్పద స్థితిలో 5 మృతదేహాలు లభించాయి. కొత్తగా చనిపోయిన ఐదుగురిలో ముగ్గురు డ్రగ్స్‌కు బానిసలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరాచీలో ఎండలు దంచికొడుతున్నాయి. దాని వల్ల ఆసుపత్రులకు తాకిడి పెరిగింది. భానుడి ప్రతాపం వల్ల ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరిగింది.  కరాచీలోనే సేవలందిస్తున్న మరో స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధి మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు బానిసలైన అనేక మంది వ్యక్తులు ఇలా చనిపోతున్న వారిలో ఉన్నారని, పెచ్చుమీరిన డ్రగ్స్ వినియోగం కారమణమంటున్నారు.