14 July, 2026 | 11:55 AM

యువకుడి దాడి.. భారత సంతతికి చెందిన వృద్ధుడు మృతి

27-06-2024 12:10 AM

న్యూయార్క్, జూన్ 26: అమెరికాలో దారుణం చోటుచేసుకున్నది. హోటల్ నుంచి బయటకు వెళ్లిపోవాలని సూచించినందుకు ఓ యువకుడు  భారత సంతతికి చెందిన మేనేజర్ హేమంత్ మిస్త్రీ(59)పై దాడికి పాల్పడ్డాడు. ఘటనలో తీవ్ర గాయాలపాలైన మేనేజర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ మూలాలున్న హేమంత్  కుటుంబం ఓక్లహోమాలో స్థిరపడింది. మిస్త్రీ హోటల్‌లో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 22 రాత్రి హోటల్‌కు వచ్చిన రిచర్డ్ లూయిస్ అనే యువకుడు ఎంతకీ బయటకు వెళ్లకపోవడంతో వాగ్వాదం జరిగింది. యువకుడు కోపోద్రిక్తుడై మేనేజర్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన సిబ్బంది క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మేనేజర్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.