విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ రద్దు.. సీఎం హార్వర్డ్ కోర్సుకు నిధులా?
మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో కోర్సుకు ప్రభుత్వ నిధులు వినియోగిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు.
విద్యాశాఖ నిధులు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, విద్యార్థుల సంక్షేమం కోసం వినియోగించాల్సి ఉండ గా, వాటిని సీఎం హార్వర్డ్ ప్రోగ్రామ్‌కు స్పాన్సర్ చేయడం అన్యాయమని విమర్శించారు. ఆకలితో ఉన్న స్కూల్ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ రద్దు చేస్తారు.. కానీ సీఎం కోసం హార్వర్డ్ సర్టిఫికెట్‌కు ప్రభు త్వ ఖర్చుతో స్పాన్స్‌ర్ చేస్తారా అని ప్రశ్నించారు.
సీఎం హార్వర్డ్ కోర్స్ అధికారిక పర్యటనగా ఎలా మారిందని ప్రశ్నించారు. విద్యార్థుల కోసం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.




