టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం

26-09-2026 | 05:05am

మానుష్-దియా జోడీకి మెడల్

బ్యాడ్మింటన్‌లో సాత్విక్ జోడీకి షాక్

నగోయా, సెప్టెంబర్ 25: ఆసియా గేమ్స్(Asian Games) 2026లో టేబుల్ టెన్నిస్ మికస్డ్ డబుల్స్ ఈవెంలో భారత జోడీ మనుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టిస్తూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. సెమీస్‌లో చైనా కు చెందిన సన్ ఇంగ్షా-వాంగ్ చుయిన్ చే తిలో 4 (8- 5- 8- 2- తేడాతో మానుష్-దియా జోడీ ఓటమి చవిచూసింది.

సెమీఫైనల్లో ప్రత్యర్థి చేతిలో వరుస గేముల్లో ఓటమిపాలైనప్పటికీ, కాంస్యం దక్కించుకుం ది. ఆసియా క్రీడల చరిత్రలో టేబుల్ టెన్నిస్ మికస్డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కు ఇది కే వలం రెండో పతకం మాత్రమే. గతంలో 20 18 ఆసియా క్రీడల్లో శరత్ కమల్ - మానికా బత్రా జోడీ తొలిసారి కాంస్యం గెలిచింది. ఇ దిలా ఉంటే ఆసియా క్రీడల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి ప్ర యాణం అనూహ్యంగా ముగిసింది. పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్లు గా బరిలోకి దిగిన భారత జోడీ.. శుక్రవారం జరిగిన తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది.

థాయ్లాండ్‌కు చెందిన పక్కపోన్-పీరాచై సుక్ఫున్ చేతిలో 21 19 14 పరాజయం చవిచూసింది. గంటా 8 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ గెలిచిన సాత్విక్-చిరాగ్.. ఆ తర్వాత పట్టు కోల్పోయిం ది. మ్యాచ్ ప్రారంభంలో సాత్విక్-చిరాగ్ జోడీ పూర్తి ఆధిక్యం కనబరుస్తూ కేవలం 20 నిమిషాల్లోనే మొదటి గేమ్‌ను 21- గెలుచు కుంది. రెండో గేమ్‌లో థాయ్‌లాండ్ జంట గట్టి పోటీనిచ్చి స్కోరు సమం చేసింది. మ్యా చ్ అనంతరం సాత్విక్, చిరాగ్ మాట్లాడుతూ పురుషుల టీమ్ ఈవెంట్‌లో నిరంతరాయంగా ఆడటం వల్ల తగినంత విశ్రాంతి ల భించలేదని, తీవ్రమైన శారీరక, మానసిక అలసట  కారణంగానే తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు