7 April, 2026 | 1:17 PM

బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరిక

29-06-2024 01:38 AM
  • ఆహ్వానించిన మంత్రి పొంగులేటి

అదిలాబాద్, జూన్ 28(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని పలువురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా మరో ఇద్దరు కౌన్సిలర్లు కారు దిగి చెయ్యందుకున్నారు. 10వ వార్డ్ కౌన్సిలర్ సుజాత, 38వ వార్డు కౌన్సిలర్ అర్చనలు తమ భర్తలు రామ్‌కుమార్, భూమన్నలతో కలిసి శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ నేతృతంలో హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.