5 September, 2026 | 5:53 AM

రేవంత్‌ది బ్లాక్‌మెయిల్ రాజకీయం

05-09-2026 | 04:30am

కొండా సురేఖ వ్యవహారంలోనూ ఒత్తిడి తెచ్చారు

నిధులివ్వని రేవంత్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం  చేయాలి 

విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్, సెప్టెంబర్ 4: సీఎం పదవిని కాపాడుకునేందుకు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్నే బ్లాక్మెయిల్ చేశారని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి(BRS Gajwel constituency incharge Vanteru Pratap Reddy) ఆరోపించారు. కొండా సురేఖ వ్యవహారంలో ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సురేఖకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అయినప్పటికీ ఆమెను సస్పెండ్ చేయాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. శుక్రవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రేవంత్రెడ్డి సుమారు 70 సార్లు ఢిల్లీకి వెళ్లారని, కాంగ్రెస్కు అధిష్టానం ఢిల్లీ అయితే బీఆర్‌ఎస్కు అధిష్టానం ప్రజలేనన్నారు. సీఎం కుర్చీని కాపాడుకోవడం, అధిష్టానాన్ని మెప్పించడంపైనే దృష్టి పెట్టిన రేవంత్రెడ్డి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని ప్రతాప్రెడ్డి అన్నారు. గజ్వేల్లో పెండింగ్ అభివృద్ధి పనుల కోసం మంజూరైన రూ.180 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలో తూప్రాన్ నుంచి జగదేవ్పూర్ వరకు హై లెవల్ బ్రిడ్జిలు, వర్గల్ మండలంలో డబుల్ రోడ్లు నిర్మించామని తెలిపారు. గజ్వేల్లోని ఈఎన్సీ ఇరిగేషన్ కార్యాలయాన్ని కొడంగల్కు తరలించారని ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గం లో రూ.36 కోట్ల విలువైన పనులకు టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తిచేసి శంకుస్థాపనలు చేసినా పాత నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. కల్యాణలక్ష్మి రీయింబర్స్మెంట్ సహా ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

హైడ్రా పేరుతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి, గజ్వేల్లోని స్థానిక కాంగ్రెస్ నాయకులు అవినీతి, కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ఒకసారి ప్రజాభిప్రాయ సర్వే నిర్వహించుకోవాలని వంటేరు ప్రతాప్రెడ్డి సూచించారు.

మరిన్ని వార్తలు