18 July, 2026 | 12:04 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

మంత్రి ఉత్తమ్ తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు

29-09-2024 04:56 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. కిమ్స్ ఆసుపత్రిలో కొద్ధి రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ఉత్తమ్ తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఆదివారం కన్నుమూశారు. పలువురు నేతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించి పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్, బీర్ల ఐలయ్య నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డిని వైఎస్ షర్మిల పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.