గణపురంలో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ నూతన కమిటీ ఎన్నిక
గణపురం,(విజయక్రాంతి): గణపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ నూతన మండల కమిటీ ఎన్నికల సమావేశం గురువారం నోముల శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జి మడిపల్లి శ్యాంబాబు మాదిగ, రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరిగే జాతీయ మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎంఆర్‌పీఎస్: మండల అధ్యక్షుడిగా దొమ్మటి రాకేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా జన్ను పవన్ కళ్యాణ్, ప్రధాన కార్యదర్శిగా కొలువురి విష్ణు మాదిగ ఎన్నికయ్యారు. ఎంఎస్‌పీ: మండల అధ్యక్షుడిగా మాస్ నాగరాజు మాదిగ, అధికార ప్రతినిధిగా కుక్కమూడి కుమార్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా జన్ను ప్రశాంత్ మాదిగ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.






