27 August, 2026 | 9:55 PM

తెలంగాణ మానవహక్కుల పరిరక్షణ సంఘం ఉపాధ్యక్షుడి గా శేఖర్

27-08-2026 04:54 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఐలవేణి శేఖర్ ను తెలంగాణ మానవహక్కుల పరిరక్షణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు కృష్ణ దేవరాయలు ప్రకటించారు. శేఖర్ సామాజిక సేవా కార్యక్రమాలు,మానవ హక్కుల పరిరక్షణ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించి, తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినట్లు పేర్కొన్నారు. అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, సంఘం అభివృద్ధికి ప్రజా సేవకు అంకితభావంతో పనిచేస్తానని శేఖర్ తెలిపారు.