5 September, 2026 | 7:15 AM

ఆపరేషన్ ‘కాంగ్రెస్ బాకీ’

05-09-2026 | 04:35am

వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ దేశపతి శ్రీనివాస్ 

వెల్దుర్తి, సెప్టెంబర్ 4, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని  నర్సాపూర్ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి(MLA Sunitha Laxma Reddy) ఆరోపించారు. మసాయిపేట్ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రజలకు ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేశారు.

ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అలాగే ఉద్యోగ సంఘం నాయకుడు దేవి శ్రీ ప్రసాద్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసన కార్యక్రమాల ద్వారా ఎండగడతామని తెలిపారు. రైతులను మహిళలను వృద్ధులను వికలాంగులను మోసం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం  వెయ్యి రోజుల పాలన పండుగ చేసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ సర్పంచ్లు మధుసూదన్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, నరసింహారెడ్డి, శ్రీనివాస్ నాయక్, బాలేష్, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, హరికృష్ణ,మన్సూర్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు