01-12-2024 01:48:40 AM
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): త్వరలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) మద్దతు తెలిపింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ ఎమ్మె ల్సీ అభ్యర్థి పింగళి శ్రీపాల్‌రెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డిలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ బీటీఏ అధక్ష, ప్రధాన కార్యదర్శులు కే చైతన్య, ఎం గంగరాజు ఒక ప్రకటనను విడుదల చేసినట్టు పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పింగళి శ్రీపాల్‌రెడ్డి, పుల్గం దామోదర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నియాజకవర్గ అభ్యర్థుల విజయానికి తాము కృషి చేస్తామని బీటీఏ నేతలు ఈ మేరకు తెలిపారు.