01-12-2024 01:50:38 AM
అదనపు డీజీపీ మహేశ్ భగవత్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ ౩౦ (విజయక్రాంతి): ఉద్యోగం సాధించాలనే కసితో చదవాలని అదనపు డీజీపీ మహేష్ భగవత్ అభ్యర్థులకు సూచించారు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ రీడింగ్ రూమ్ చైన్ 27వ బ్రాంచిని కింగ్‌కోఠిలో క్యాబిన్‌మేట్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ సురేష్‌కట్టా, డైరెక్టర్ సిషిర్ కుమార్ అప్పికట్ల, కామినేని ఆస్పత్రుల ఎండీ డా.శశిధర్ కామినేనితో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, వృత్తినిఫుణులు, రచయితలు, వ్యాపా ర నిపుణులకు.. కార్పొరేట్ రీడింగ్ రూప్ చైన్ అనుకూల ప్రదేశంగా ఉంటుందని చెప్పారు. క్యాబిన్‌మేట్ వ్యవస్థాపకులు సురేష్ కట్టా మాట్లాడుతూ 2021లో విశాఖపట్నంలో ప్రారంభించిన క్యాబిన్‌మేట్.. దేశంలోనే అతిపెద్ద రీడింగ్‌రూమ్ చైన్‌గా ఆవిర్భవించిందని తెలిపారు.