01-12-2024 01:47:10 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కరీంనగర్, నవంబరు 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్‌ఎస్ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై మాట్లా డే నైతిక హక్కు లేదని సుడా చైర్మన్, కరీంనగర్ నగర కాం గ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినప్పటికీ కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదనేదన్నారు. సోనియాగాంధీ ఆనాడు కరీంనగర్ సభలో ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక ఇబ్బందులను అధిగమించి రాష్ట్రం ఇచ్చిందన్నారు.
తెలంగాణ ఉద్య మం పేరుతో గోతికాడి నక్కలా వచ్చి, ఇతరుల సీటును లాక్కొని నాయకుడైన కేటీఆర్.. కరీంనగర్ గడ్డమీదకు వచ్చి నీతులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఉనికిని చాటుకునేందుకు దీక్షా దివస్ పేరుతో అల్గునూరులో ఒక్కరోజు డ్రామా నడిపారని విమర్శించారు. మీడియా సమావేశం లో ఎండి తాజ్, శ్రావణ్‌నాయక్, సమద్ నవాబ్, జీడి రమేష్ దన్నాసింగ్, పోరండ్ల రమేష్, కుర్ర పోచయ్య, ఖాజాఖాన్, శెహెన్ష, అమేర్, అష్రఫ్, సుదర్శన్, మాసుంఖాన్, బషీర్, హనీఫ్, ఆంజనేయులు, అనిల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.