కిట్స్ ఈఈ ఈ విద్యార్థుల క్షేత్ర స్థాయి పర్యటన

16-09-2026 | 08:53pm

కోదాడ,(విజయక్రాంతి): స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల(KITS Women's Engineering College) విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా బుధవారం బీటెక్ ఈఈఈ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ మణుగూరు సందర్శించడం జరిగింది. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భద్రాద్రి ధర్మల్ పవర్  అసిస్టెంట్   ఇంజనీర్స్  ఎండీ శహన్షా, రమేష్ విద్యార్థినులకు విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యత గురించి విద్యార్ధులకు విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, విభాగాధిపతి డాక్టర్ శివాజీ, కళాశాల  అద్యాపకులు రామకృష్ణ,నాగన్న, ప్రతుష మౌనిక, విద్యార్థులు పాల్గొమ్నారు.

మరిన్ని వార్తలు