31 July, 2026 | 5:25 PM

బిజెపి పార్టీ నుండి బుడగం రవి సస్పెండ్

31-07-2026 04:52 PM

రాష్ట్ర కమిటీ నిర్ణయం...

కొత్తగూడెం,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ, భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు, బుడగం రవి ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ,ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇకపైన సోషల్ మీడియాలో లేదా ఏదైనా క్రమశిక్షణ రహిత కార్యక్రమాలు, ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని,రాష్ట్ర పార్టీ తెలియపరచడం జరిగింది. రాబోవు రోజుల్లో భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, విజయం సాధించాలంటే కార్యకర్తలు అందరూ కూడా క్రమశిక్షణతో,మంచి సద్భావన భావంతో మెలగాలని,భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి,జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ విజయ చంద్రారెడ్డి తెలియజేశారు.