అయిజ మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం
అయిజ మార్చి 25: అయిజ మునిసిపాలిటీలో చైర్మన్ సీఎం సురేష్ ఆధ్వర్యంలో 2026-,-2027 బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా బడ్జెట్ నిధులను సక్ర మంగా వినియోగించి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, అవినీతి జరిగితే మా త్రం శాఖ పరమైన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు.
అనంతరం చైర్మన్ సు రేష్ మాట్లాడుతూ అయిజ మునిసిపాలిటీ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం జరిగిందన్నారు. అయిజ పట్టణ సర్వతో ముఖాభివృద్ధికి పాలకవర్గం అంకితభావంతో పనిచేస్తుందని ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రా ధాన్యత అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాల నర్సింహులు, మున్సిపాలిటీ కమిషనర్ సైదులు, వార్డు కౌన్సిలర్ లు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




