మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
అలంపూర్ మార్చి 25: రబీ సీజన్ లో రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంటలను సాగు చేశారని కాబట్టి ప్రభుత్వం ముందస్తుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని బీసీ సంఘ నాయకులు సింగవరం -1 గ్రామ సర్పంచ్ గొంగళ్ళ ఈశ్వర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అలంపూర్, ఉండవల్లి రాజోళి, మానవపాడు, ఇటిక్యాల, ఎర్రవల్లి, వడ్డేపల్లి తదితర మండలాల్లో రబీ సీజన్లో రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు.
ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన పం టలు అధిక వర్షాల కారణంగా పూర్తిగా దె బ్బతిన్నాయని వాటిని తీసేసి ఈ రబీ సీజన్ లో రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట ను సాగు చేసినట్లు తెలిపారు.రైతులు పం డిన పంట దళారుల చేతిలో మోస పోకుం డా ముందస్తుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.




