7 August, 2026 | 10:56 AM

బంగారం కొన్నట్టు నటిస్తూ.. నగలు చోరీ చేసిన బుర్కా గ్యాంగ్

07-08-2026 10:16 AM

సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలు.

తాండూరు, ఆగస్టు 7, (విజయక్రాంతి): బంగారం దుకాణంలో బంగారు(Gold) నగలు కొంటున్నట్టు నటిస్తూ సిబ్బందికి మాటల్లో పెట్టి బురక గ్యాంగ్ బంగారు నగలుచోరీ చేసిన ఘటన వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూరు పట్టణంలో జరిగింది. సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఉన్న గంజిపల్లి సాయి జువెలర్స్ లో ఓ వ్యక్తితో పాటు బుర్కా ధరించి వచ్చిన నలుగురు మహిళలు బంగారు నగలు కొనుగోలు చేస్తామని ఆభరణాలు చూపించాలని యజమానిని కోరారు. నగలు చూపిస్తున్న సిబ్బందితో ముగ్గురు మహిళలు మాటల్లో పెట్టారు. ఓ మహిళ కౌంటర్ పైకి ఎక్కి డిస్ప్లే లో ఉన్న 10 గ్రాముల నెక్లెస్ ను చోరీ చేసి బ్యాగులో వేసుకొని దర్జాగా వెళ్లిపోయారు. గమనించిన షాపు యజమాని గంజిపల్లి అమన్ సింగ్ సిసి కెమెరా లో నిక్షిప్తమైన దృశ్యాల తో పోలీసులకు ఫిర్యాదు  చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు.