7 August, 2026 | 10:58 AM

ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

07-08-2026 09:51 AM

రాంపూర్ చౌరస్తా వద్ద ప్రమాదం

నంగునూరు,(విజయక్రాంతి): సున్నం లోడుతో వెళ్తున్న ఆటో,టైరు పేలి బోల్తా పడ్డ ఘటన నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద గురువారం  చోటుచేసుకుంది.సిద్దిపేట నుంచి జమ్మికుంటకు వెళ్తున్న ఈ ఆటోలో ఏడుగురు కూలీలు ప్రయాణిస్తుండగా,రాంపూర్ క్రాసింగ్ సమీపంలో వెనుక టైరు పేలడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది.ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న రాజగోపాలపేట ఎస్ఐ టీ.వివేక్ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.రోడ్డుపై సున్నం బస్తాలు పడడంతో ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయాన్ని స్థానికుల సాయంతో తొలగించి క్లియర్ చేశారు.