సచివాలయంలో కొనసాగుతున్న కేబినెట్ సమావేశం
21-06-2024 05:07 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ శుక్రవారం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. రుణమాఫీ అర్హ త లు, విధివిధానాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇరు రాష్ట్రల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు, బడ్జెట్ పద్దులపై కూడా చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపారు. దక్షిణకొ రియా రాయబారి హెచ్.ఈ.చాంగ్ జే-బోక్ బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది.






