కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
21-06-2024 04:47 PM
హైదరాబాద్: దేశంలో హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి హోం శాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని పూర్తిగా అభద్రతా భావంతో బ్రతికెలాగ చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కొల్లాపూర్‌లోని మూల్చింతలపల్లి గ్రామంలో ఓ గిరిజన మహిళను వారం రోజులుగా కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసులకు ఈ మాత్రం సమాచారం లేకపోవటమనేది ఈ రాష్ట్రంలో భద్రత వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సమాచరణ సేకరణ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నది అనేది మనకు అర్థం అవుతుందని ప్రవీణ్ కుమార్ విమర్శించారు.






