నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
21-06-2024 05:39 PM
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై విచారించిన కోర్టు స్టే ఇచ్చేందుకు మరోసారి నిరాకరించింది. నీట్ కౌన్సిలింగ్ పై ఎన్టీఏకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు నీట్ పై దాఖలైన కొత్త పిటిషన్లను పెండింగ్ ఉన్న పిటిషన్లతో కలిపింది. వాటన్నింటిపై జూలై 8వ తేదీన విచారించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే నీట్ పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు చేస్తోంది.






