calender_icon.png 16 February, 2026 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిగి మున్సిపల్ పీఠం కోసం క్యాంపు రాజకీయాలు

16-02-2026 10:17:07 AM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్(Parigi Municipal) పీఠం కోసం ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలు(Camp politics) చేస్తున్నాయి. పరిగిలోని 18 స్థానాల్లో చెరో 8 వార్డులను బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుచుకున్నాయి. పరిగిలోని మరో రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థలు విజయం సాధించారు.

ఇండిపెండెంట్ గా గెలిచిన అక్కమ్మ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపింది. మరో స్వతంత్ర అభ్యర్థి హనుమంత్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. పరిగి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు కమిషనర్ పూర్తి ఏర్పాట్లు చేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మెహన్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయనున్నారు. రామ్మోహన్ రెడ్డి ఓటుతో ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. పరిగి మున్సిపల్ పీఠం పై ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశముంది. పరిగిలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు కీలకంగా మారింది.