29 July, 2026 | 7:58 PM

Breaking News

బెల్లం రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం   •   అటవీ జంతువుల ప్రాణాలే లక్ష్యం..   •   రామాయంపేటలో కొత్త పోలింగ్ బూత్‌లకు బీజేపీ డిమాండ్   •   కామారెడ్డి జిల్లా యోగ భవన్లో గురు పౌర్ణమి వేడుకలు   •   కేరళ గ్లోబల్ హైస్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకైక లక్ష్యం విద్యార్థుల వికాసం కోసం పనిచేయాలి   •   జూలై 30న సత్తుపల్లిలో ఎన్‌సీపీ - ఎన్‌డీఏ కూటమి (ఎన్‌వైసీ) రాష్ట్ర కార్యాలయం ప్రారంభం   •   పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యం   •   శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గురు పౌర్ణిమ వేడుకలు   •   పలుగ్రామపంచాయతీలలో ప్రత్యేక సమావేశాలు   •  

పుర పోరు అంతిమ ఘట్టం

16-02-2026 10:27 AM

హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన పురపోరులో ఇవాళ అంతిమఘట్టం పూర్తి కానుంది. సోమవారం నాడు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు ఎన్నిక కానున్నారు. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపల్ ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నికల జరగనుంది. 116 మున్సిపాల్టీల్లో 2,594 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్పొరేషన్లలో 414 మంది కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 11న 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి.