10-02-2026 12:19:48 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్
హన్మకొండ,ఫిబ్రవరి 9(విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న పరకాల మునిసిపల్ పరిధిలో ఈ రోజు సాయంత్రం 5.00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని, ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు.48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో పరకాల పట్టణంలో ఎవరు కూడా బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని అన్నారు.
ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, ఎం.సి.సి బృందాలు, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 9వ తేదీ సోమవారం సాయంత్రం 5.00 గంటల నుండి 11వ తేదీ పోలింగ్ ముగిసేంత వరకు మద్యం షాపులను, కల్లు దుకాణాలను మూసివేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకుని ఈ నెల 13న కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్ ముగిసేంత వరకు డ్రై డే అమలు లో ఉంటుందని తెలిపారు.
మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11 న సెలవు.
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుటకు గాను ఈనెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ రోజున స్థానిక సెలవు గా ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు.