calender_icon.png 10 February, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి

10-02-2026 12:21:15 AM

  1. కలెక్టర్ స్నేహ శబరీష్

పదో తరగతి విద్యార్థుల కోచింగ్, హాస్టల్స్ ఫిర్యాదు పెట్టెలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష

హనుమకొండ, ఫిబ్రవరి 9( విజయ క్రాంతి):పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా నిర్వహిస్తున్న ప్రత్యేక కోచింగ్ తరగతులపై మం డలాల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్ట ర్ స్నేహ శబరీష్ ఆదేశించారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులతో కలెక్టర్ సమీ క్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పదో తరగతి పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్  ఎస్‌ఐఆర్) పురోగతిపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లాలోని మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులైన వివిధ శాఖల జిల్లా అధికారులను ఆయా పాఠశాలలు, హాస్ట ల్స్ను సందర్శించి అక్కడి పరిస్థితులు, వసతులు, బోధన విధానం, విద్యార్థులకు అం దుతున్న సేవలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఏ విధంగా జరుగుతోందో సమీక్షించి, సర్వే నిర్వహణ తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకు న్నారు.జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, మండల ప్రత్యేక అధికారులు తప్పని సరిగా ఉన్నత పాఠశాలలు, హాస్టల్స్ను సందర్శించాలని, పదో తరగతి విద్యార్థులకు నిర్వ హిస్తున్న ప్రత్యేక కోచింగ్ తరగతులు సమర్థవంతంగా జరుగుతున్నాయా లేదా పరిశీలిం చాలని తెలిపారు.

హాస్టల్స్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్సులను ఓపెన్ చేసి అందులో వచ్చిన ఫిర్యాదులను కేటగిరీలుగా నమోదు చేసి, సంబంధిత వివరాలతో కూడిన నివేదికను వారం రోజులలో అందజేయాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లం. అప్పయ్యను ఆదేశించారు.

అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ కోచింగ్ క్లాసులను మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, డీఆర్వో వై.వి. గణేష్, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, సిపిఓ సత్యనా రాయణ రెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.