27 July, 2026 | 9:10 PM

సీఈఐఆర్ పోర్టల్‌తో మొబైల్ ఫోన్ల రికవరీ

27-07-2026 08:28 PM

బాధితులకు అప్పగించిన నర్సాపూర్ పోలీసులు

నర్సాపూర్: నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసి బాధితులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్‌లు పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, ఎస్సై ఏ. రంజిత్ కుమార్ చొరవతో ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీమతి రేణుక సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులను నమోదు చేసి, సాంకేతిక ఆధారాలతో వాటి లొకేషన్‌ను గుర్తించి మొత్తం 10 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సంబంధిత బాధితులకు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. తమ పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎస్సై ఏ. రంజిత్ కుమార్‌తో పాటు ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ రేణుకను అభినందించారు.ఈ సందర్భంగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు.