calender_icon.png 10 February, 2026 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారం బంద్.. పంపకాలు షురూ!

10-02-2026 12:49:39 AM

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత వారం పది రోజులుగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు జనసేన, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఏఐఎఫ్బీ, స్వతంత్ర అభ్యర్థుల ప్రచార రథాలు, మైకులు, సౌండ్ బాక్సులు డప్పు చెప్పుళ్ళు, కార్యకర్తల నినాదాలు లేక వార్డులన్నీ ఒక్కసారిగా మూగబోయాయి. అభ్యర్థుల ప్రచార రథాలు షెడ్లకు చేరుకున్నాయి. 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారంకు తెర పడింది. ఇక అభ్యర్థులందరూ లోలోపల ప్రచారాన్ని చేపట్టనున్నారు.   గత వారం, పది రోజులుగా ఆయా పార్టీల అభ్యర్థులు,  స్వతంత్రులు ప్రచారాలతో సందడి చేయగా, ఎన్నికల నిబంధనల మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో వార్డుల్లన్నీ బోసిపోయాయి. 

  1. మూగపోయిన మైక్‌లు... షెడ్లకు చేరిన ప్రచార రథాలు..
  2. సోమవారం రాత్రి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలకు సిద్ధం...

ఆదిలాబాద్/మంచిర్యాల/నిర్మల్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): గత నెల 28వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 30వ తేదీ తొమ్మిగిసింది. ఫిబ్రవరి మూడో తేదీ వరకు స్క్రూటినీ, విత్ డ్రా, ఆయా పార్టీ అభ్యర్థుల బి ఫామ్ స్వీకరణ, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. అనంతరం అభ్యర్థులు ప్రారంభించిన ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు జోరుగా సాగింది. 

ఈ వారం రోజులపాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, ఎం.ఐ.ఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జానసేన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ వార్డు పరిధిలోని ఆయా కాలనీల్లో విసృత ప్రచారం చేపట్టారు. తమ పార్టీ ముఖ్య నేతలతో పాటు అభ్యర్థులు ఇంటింటి ప్రచా రం చేశారు. ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఎన్నికల ప్రచార రథాలను ఏర్పాటు చేసి, ప్రజల చెవు లు చిల్లుపడేలా మైక్‌ల మోతతో ఉదరగొట్టారు.

ప్రతిరోజూ వార్డుల్లో తిరుగుతూ ఓట ర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు కాళ్ళు మొక్కడం, పొర్లు దండలు పెట్టం, పిల్లల ముడ్డిలు కడగడం ఇలా చెయ్యను పని అం టూ లేదు. మొత్తానికి ఓటర్ల మెప్పు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు.

మొత్తానికి వారం రోజులుగా అలుపెరగకుండా ఇంటింటికి తిరిగిన అభ్యర్థుల, నాయకుల ప్రచారానికి తెర పడటంతో సోమవారం రాత్రి నుండి మంగళవారం రాత్రి వరకు మొత్తం లోలోపల అభ్య ర్థులు ప్రచారానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఎవరికివారు తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 11వ తేదీన జరిగే పోలింగ్‌లో ఓటర్లు ఎవరికి తమ ఓటు వేసి గెలిపిస్తారు తెలియాలంటే 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మొదలైన ప్రలోభాల పర్వం...

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లు, నాలుగు మున్సిపాలిటీల్లోని 89 వార్డుల్లోని ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు 149 వార్డుల నుంచి 693 మంది అభ్యర్థులు ఎవరి స్థాయిలో వారు పంపకాలు సోమవారం రాత్రి నుంచే షురూ చేశారు. వార్డులలో, కాలనీలలో అభ్యర్థుల సఫోర్టుదారులు ఓటర్ల లిస్టును చేతుల్లో పట్టుకొని ఫలానా ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయని పరి శీలిస్తు తమకే మీ ఓటు వేయాలని కోరుతూ ఓటుకు నోట్లు పంచిపెట్టడం మొదలు పెట్టా రు.

వార్డులోని ఓట్లు మరో వార్డులో ఉన్నా, వారు పట్టణం వదిలి పల్లెలకు వెళ్లిపోయిన వారి లిస్ట్ తయారు చేసి వారిని ఫోన్‌లలో సంప్రదింపులు మొదలుపెట్టారు. రాను పోను చార్జీలతో పాటు ఓటుకు ఇంతా అని లెక్కలు వేసి వారిని తీసుకువచ్చేందుకు మనుషులను కేటాయించే పనిలో పడ్డారు. 

చివరి రోజు పోటాపోటీగా...

నిన్న, మొన్నటి వరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్ల నుంచి 240 మంది అభ్యర్థులు కార్పొరేటర్ అభ్యర్థులు, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 వార్డులకు 173 మంది, చెన్నూర్ లోని 18 వార్డులకు 107, క్యాతనపల్లిలోని 22 వార్డులకు 113, లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 15 వార్డులకు 60 మంది కౌన్సిలర్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.

ప్రచారం చివరి రోజై న సోమ వారం ప్రతి డివిజన్, వార్డు, కాలనీలో చూసినా ఎవరో ఒక అభ్యర్థి ప్రచారం, ప్రచార వాహనాలే కనిపించాయి. ఏ ఒక్కరు డబ్బులకు వెనుకాడకుండా పోటీలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసి, ఓటర్లను మభ్య పెట్టే పని మొదలు పెట్టారు.

సీనియర్లకు గెలుపు బాధ్యతలు

నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు ఉండగా బైంసాలో 26 ఖానాపూర్ లో 12 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులో సగం స్థానాలు కైవసం చేసుకుంటేనే మున్సిపల్ పీఠం దక్కనుంది. నిర్మల్ మున్సిపల్ పీఠాన్ని బీసీ మహిళకు కేటాయించగా బైంసా ఖానాపూర్ జనరల్ సీట్లు కావడంతో మూడు మున్సిపాలిటీలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని నిర్వహించాయి. బిజెపి కి ఆ పార్టీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ఖానాపూర్ లో పార్టీ అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముగించారు.

ఇక కాంగ్రెస్ లో నిర్మల్ లో మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి వేణుగోపాల చారి పార్టీ సీనియర్ నేతలు శ్రీఆర్రావు అర్జున్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముధోళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ప్రారంభ పటేల్ బట్టల రెడ్డి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఖానాపూర్ లో టిఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ జిల్లా నియోజకవర్గ జనసేన నాయక్ నిర్మల్ లో బూత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ పార్టీ సీనియర్ నేతలు రామకృష్ణారెడ్డి మార్కొండ రాము కష్టపడుతున్నారు ముదులు రమాదేవి గాద విలాస్ కిరణ్ కొమురెవర్ లోలం శ్యాంసుందర్ సీనియర్ నేతలు పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు తీసుకున్నారు.