17 June, 2026 | 8:41 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

అభ్యర్థులు ఖర్చులను స్పష్టంగా నమోదు చేయాలి

07-02-2026 12:00 AM

మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు దేవేందర్

కుమ్రం భీం ఆసిఫాబాద్ ,ఫిబ్రవరి 6(విజయ క్రాంతి): 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో పోటీలో ఉండే అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు దేవేందర్ అన్నారు. శుక్రవారం  కలెక్టరేట్ లో పోటీలో ఉన్న అభ్యర్థులతో వ్యయ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ అభ్యర్థులు తమ ఖర్చులను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.

అభ్యర్థులు సభలు, సమావేశాలు, ర్యాలీల కొరకు ముందస్తుగా అనుమతి పొందాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఖర్చులను నమోదు చేసి వివరాలను నిర్దిష్ట కాలపరిమితిలో సమర్పించాలని సూచించారు. ఎన్నికల వ్యయ నోడల్ అధికారి నదీమ్ ఖుద్దుసి, ఆసిఫాబాద్ మున్సి పల్ కమిషనర్ గజానన్, మాస్టర్ ట్రైనర్ ఊసన్న, ఎన్నికల విభాగంఅధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు.