calender_icon.png 7 February, 2026 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ రూల్స్‌కు చిన్నారుల స్వరం

07-02-2026 12:00:00 AM

రాధిక చౌరస్తాలో అవగాహన కార్యక్రమం

కుషాయిగూడఫిబ్రవరి 6 (విజయ క్రాంతి) : రాధిక చౌరస్తాలో గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో చిన్న పిల్లలతో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ లింగారెడ్డి, ఏఎస్‌ఐ నర్సింలు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల చేత ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ ప్రాధాన్యతను వివరించారు.

ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఎలా పాటించాలి, రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనదారులు నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం వంటి అంశా లపై అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా తయారవుతారని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమం రాధిక చౌరస్తాలో వచ్చిన ప్రజలను ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్ర మంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎంవీ శేషు కుమారి, పి పి టి ఇంచార్జ్ శ్వేతా రెడ్డి, టీచర్లు అశ్విని, రష్మీ, సహాన, ఉషా, కోమల్, జితేందర్, నరేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.