నిద్ర పట్టడం లేదా!
నిద్రపట్టడం లేదా? మంచి నిద్ర కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదా? అయితే కొన్ని హెర్బల్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా మంచి నిద్రను పొందవచ్చు. ప్రతిరోజూ మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ప్రశాంతత, విశ్రాంతిని పొందవచ్చు. మంచి నిద్ర కోసం కింది హెర్బల్ డ్రింక్స్‌ని ఓసారి ట్రై చేసి చూడండి..!
లావెండర్ టీ
లావెండర్ మంచి సువాసనను కలిగి ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సాయపడుతుంది. నిద్రకు ముందు లావెండర్ టీ తాగడం వల్ల మనస్సు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. తద్వారా మంచి నిద్ర పడుతుంది. నిద్రకు ఒక గంట ముందు ఈ టీని తీసుకోవడం మంచిది. లావెండర్ టీ కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
పుదీనా టీ
పిప్పర్‌మింట్ టీ రిఫ్రెష్‌గా ఉండటమే కాదు.. మీ కండరాలను రిలాక్స్ చేయడంలో సహయపడుతుంది. అలాగే టెన్షన్‌ను తగ్గించగలదు. తద్వారా మంచి నిద్ర పడుతుంది. నిద్రపోయే ఒక గంట ముందు సాయంత్రం ఈ టీని సేవించడం ఉత్తమం. పిప్పర్‌మింట్ టీ పేగు సిండ్రోమ్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది.
అల్లం టీ
అల్లంలో యాంటీ ఇన్‌ఫమేటరీ, డైజెస్టివ్ గుణాలు ఉన్నాయి. కండరాలను రిలాడ్స్ చేయడంతో పాటు మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్రించే ముందు అల్లంటీ తాగడం వల్ల అజీర్ణం, ఉబ్బరం తగ్గుతుంది. ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. నిద్రకు ఒక గంట ముందు అల్లం టీని సేవించాలి. అల్లం టీ కూడా వికారం తగ్గించడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహయపడుతుంది.
అశ్వగంధ టీ
అశ్వగంధ అనేది అడాప్టోజెనిక్ హెర్బ్. శరీరంలో ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని కలిగి స్తుంది. కార్టిసాన్ స్థాయిలను తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ఒత్తిడికి సంబం ధించిన హార్మోన్, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. నిద్రకు ఒక గంట ముందు అశ్వగంధ టీని సేవించడం ఉత్తమం. అశ్వగంధ టీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
పసుపు టీ
పాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి ఇతర సుగంధ ద్రవ్యాలతో పసుపు కలపాలి. అప్పుడు గోల్డెన్ మిల్క్ మాదిరిగా మారుతాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. మంచి నిద్రను అందిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహయపడుతుంది.






