3 May, 2026 | 12:04 PM

మీర్‌పేట్‌లో కారు డ్రైవర్ బీభత్సం..

03-05-2026 10:47 AM

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో తండ్రి కొడుకులను కారుతో ఢీకొట్టి వారిపై దాడి పాల్పడడు. వివరాల్లోకి వెళ్లితే... ఎస్కె జిలానీ, అతని కుమారుడు ఫైసల్ ఇద్దరు గాయత్రీ నగర్ నుండి ఎల్బి నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, ఓ కారు వారిని వెనుక నుండి ఢీకొట్టింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి గొడవకు దారితీసింది. కారు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా, జిలానీ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కారుకి అడ్డంగా నిలబడి పోనివ్వకుండా చేస్తున్నాడనే కోపంతో అలాగే అతడిని ఢీకొట్టుకుంటూ వెళ్ళాలని చూశాడు.

అయితే బాధితుడు కారు బోనెట్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. దీంతో అతన్ని అలాగే రెండు కిలోమీటర్లు ఈడ్చుకుపోయాడు. అతడు గాయాలతో నొప్పితో అరుస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా రాక్షసత్వం ప్రదర్శించాడు. ఆ కారు బాలాపూర్ క్రాస్‌రోడ్స్ వరకు వేగంగా వెళ్లి, వెనక్కి తిరిగి, చివరకు మండమల్లమ్మ జంక్షన్ సమీపంలో స్థానికులు అడ్డగించి పట్టుకున్నారు. ఘటనలో బాధితుడు ఫైసల్‌ రెండు కాళ్లు విరిగిపోయి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దుర్ఘటనను ఇతర వాహనదారులు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో పెట్టడంతో భయటపడింది.