3 May, 2026 | 11:19 AM

సంతలో టాక్సీ అక్రమ వసూళ్లపై గుతేదారుల దౌర్జన్యం

03-05-2026 10:03 AM

మహిళలపై అసభ్యకరమైన మాటలు

పెబ్బేరు: పెబ్బేరులో శనివారం నిర్వహించే సంతలో పశువులు, గొర్రెలు వినియోగదారులతో గుతేదారులు టాక్సీ రూపంలో నగదును అక్రమంగా వసూళ్లు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు  సంతలో వ్యాపారం చేసేందుకు వచ్చే చిన్న వ్యాపారులు, రైతుల నుంచి నిర్ణయించిన రుసుముకంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సంతకు వచ్చిన మహిళలను గౌరవించకుండా ఈ అక్రమ వసూళ్లను ప్రశ్నించిన మహిళలపై గుతేదారులు అసభ్య పదజాలంతో దూషిస్తూ, మాటలతో బెదిరిస్తున్నారని వాపోతున్నారు.

అసలే ఈ సంతకు  ప్రభుత్వం పరంగా టెండర్ లేకపోవడంతో  మున్సిపాలిటీ అధికారులు కానీ, పాలకవర్గం సంతపై పట్టించుకోకపోవడంతో గుత్తేదారులు ఆడిందట పాడిన పాటగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై  సంబంధిత  అధికారులు, మున్సిపాలిటీ  పాలకవర్గం తక్షణ చర్యలు తీసుకుని, గుతేదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.