అదుపుతప్పి చెరువులో పడ్డ కారు: 8 మంది మృతి
03-11-2024 11:50 AM
బలరాంపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు చెరువులో పడి ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారులో ఉన్న వ్యక్తులు లారిమా నుండి సూరజ్‌పూర్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు బల్‌రాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ వైభవ్ బ్యాంకర్ తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.




