14 July, 2026 | 10:32 PM

"మాచన" కు కామన్ వెల్త్ పురస్కారం?!

15-07-2026 12:00 AM

పొగాకు నియంత్రణ లో విశేష కృషి కి గాను టొబాకో కంట్రోల్ హీరో అవార్డు అందుకున్న ఏకైక తెలుగు వ్యక్తి మాచన రఘునందన్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి బయో ఎథిక్స్ పేరిట కామన్ వెల్త్ పురస్కారం అందజేస్తుంది.

కాగా 2026 కు గాను ఈ అవార్డు ను మాచన రఘునందన్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.మంగళవారం నాడు నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఈ విషయం పై కామన్ వెల్త్ ఓ స్పష్టత ఇచ్చిందని రఘునందన్ వివరించారు. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి రఘునందన్ జూన్ మొదట్లో అటు యునెస్కో తో పాటు కామన్ వెల్త్ కు పంపారు.

స్కూళ్లు కాలేజీల వద్ద నో స్మోకింగ్ జోన్ అమలు చేయాలి అని రఘునందన్ ఇటీవలే సుప్రీం కోర్టు ను వేడుకున్నారు. అలగే ప్రధాని కార్యాలయం కు,రాష్ట ముఖ్యమంత్రి కి,చీఫ్ సెక్రటరీ కి సైతం టొబాకో కంట్రోల్ కోసం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ క్రమం లో నే అనూహ్యంగా కామన్ వెల్త్ పురస్కారం కు ఎంపిక అయ్యే అవకాశం కూడా దక్కనుంది