15 June, 2026 | 7:45 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ఎన్‌హెచ్‌44పై కారు బోల్తా, నలుగురికి గాయాలు

11-05-2026 06:32 PM

భారీ ట్రాఫిక్ జామ్

భిక్కనూర్,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో సోమవారం మధ్యాహ్నం ఎన్‌హెచ్‌44పై కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన కలకలం రేపింది. నిర్మల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఢిల్లీ పాస్సింగ్ కలిగిన వాగన్ఆర్ కారు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు.

కారులో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదంతో ఎన్‌హెచ్‌ 44పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి, ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.