14 August, 2026 | 9:55 AM

కుటుంబ కలహాలతో కోర్టు అటెండర్ ఆత్మహత్య

14-08-2026 09:00 AM

అలంపూర్: కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన అలంపూర్‌కు చెందిన కోర్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి చాకలి శాలన్న (30) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శాలన్న కోర్టులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో భార్యతో కుటుంబ విషయమై గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన శాలన్న ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.మృతుడి తండ్రి ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, శాలన్న భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే ఆరోపణలపై అశోక్, అతని భార్యపై సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.