16 April, 2026 | 9:07 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఎండాకాలంలో నర్సరీలోని మొక్కలు ఎండకుండా చూసుకోవాలి

20-02-2026 01:48 AM

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): మండలంలోని వదల్పర్తి,మాల్తుమ్మెద గ్రామాలలో గల నర్సరీలను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ....ఎండాకాలంలో నర్సరీలోని మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని,ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో సరిపడ నీటిని అందించాలన్నారు.నర్సరీలోని మొక్కల పెంపకంలో గ్రామాలకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు.

నర్సరీలో అన్ని రకాల మొక్కలు పెంచాలన్నారు.అనంతరం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో సీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ గ్రామ సంఘాలలో తీసుకున్నటువంటి లోన్లను పూర్తిస్థాయిలో రికవరీ చేసి కొత్తవారికి కొత్త లోన్లను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సాయిలు, ఫీల్ అసిస్టెంట్లు, నర్సింలు, సాయిలు, స్వప్న, సీసీలు నారాయణ, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.