16 April, 2026 | 7:19 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

20-02-2026 01:50 AM

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామ కార్యదర్శి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో తహరా బేగం అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న వేసవికాలంలో యాక్షన్ ప్లాన్ ముందస్తు ప్రణాళికను ఎల్లారెడ్డి ఎంపీడీవో తాహేర బేగం, పంచాయతీ కార్యదర్శులతో తయారు చేశారు.

ప్రత్యేక సమావేశంలో భాగంగా గ్రామాలలో మంచినీటి సరఫరా సౌకర్యవంతం చేయాలని తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శుల కు సూచించారు. ఎల్లారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామాలలో తాగినీటి సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పంచాయతీ పరిధిలో నర్సరీలో పర్యవేక్షణ పై ప్రత్యేకంగా చర్చించారు.

పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో విధులు నిర్లక్ష్యం వహించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పట్ల అధికారులు ఆ శ్రద్ధ విడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రకాష్, ఏపీవో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.