బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు

27-04-2024 12:17:30 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26 : బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై ఎన్నికల సంఘం శుక్రవారం కేసు నమోదు చేసింది. ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి ఓట్లు అభ్యర్థించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కేసు పెట్టామని కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. తేజస్వీ సూర్య దక్షిణ బెంగళూరు స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. శుక్రవారం అక్కడ పోలింగ్ జరిగింది. ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ గురువారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. బీజేపీ మద్దతుదారులు 80 శాతం ఉన్నప్పటికీ 20 శాతం మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొంటున్నారని.. కానీ కాంగ్రెస్‌కు 20 శాతం మద్దతుదారులు ఉంటే 80 శాతం ఓటింగ్‌లో పాల్గొంటున్నారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రజలు పార్టీకి భారీ స్థాయిలో ఓట్లు వేయాలని కోరారు. దీంతో  ప్రచారం సమయం ముగిసి నప్పటికీ ఓటేయాలంటూ అభ్యర్థిం చిన కారణంగా ఎన్నికల కమిషన్ సీరియస్‌గా పరిగణించింది.