మన పార్లమెంట్ అభ్యర్థులు వీరే

26-04-2024 02:45:45 AM

నల్లగొండ

శానంపూడి సైదిరెడ్డి

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లికి చెందిన శానం పూడి సైదిరెడ్డి విదేశాల్లో ఉద్యోగం,  రెస్టారెంట్లు నడుపు తూ ఆర్థికంగా ఎదిగారు. సొంత మండలంలో తన తండ్రి అంకిరెడ్డి పేరిట 2014 నుంచి ‘అంకిరెడ్డి ఫౌండేషన్’ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వస్తున్నారు. 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి అసెంబ్లీకి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.  2019లో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతిపై 43,284 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈ ఏడాది మార్చి 10న బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ రంగప్రవే శం చేసిన శానంపూడి.. పార్లమెంట్‌లో అడుగు పెడతారా? లేదా? చూడాలి మరి.

కే రఘువీర్‌రెడ్డి

ఐదేండ్లుగా పీసీసీ ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్న కుందూ రు రఘువీర్‌రెడ్డి కాం గ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పెద్ద కుమారుడు. ఇటీవలి అసెం బ్లీ ఎన్నికల్లో సోదరుడు కుందూరు జైవీర్‌రెడ్డి విజయానికి ఎంతగా నో కృషి చేశారు.  గత ఏడాది  జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో డీకే శివకుమార్‌కు సన్నిహితంగా ఉంటూ పార్టీ విజయానికి కృషి చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో  గ్రామస్థాయి కార్యకర్త వరకు గుర్తించి సరైన అవకాశాలు కల్పించడంలో రఘువీర్ ముందున్నారు. నాగార్జునసాగ ర్ నియోజకవర్గంలో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2021 ఉపఎన్నికలో తండ్రి జానారెడ్డి విజ యానికి మండలస్థాయిలో కార్యకర్తలను సమన్వ య పరుస్తూ ముందుకుసాగారు. ప్రస్తుతం నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీలో నిలిచారు. ఇప్పటివరకు పార్టీ పటి ష్ఠానికి కృషిచేసిన రఘువీర్‌రెడ్డి.. ఈ ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంట్‌లో ప్రజల గొంతుక అవుతారో? లేదో? చూడాలి మరి.

కంచర్ల కృష్ణారెడ్డి

నల్లగొం డ జిల్లా చిట్యాల మం డలం ఉరుమడ్లకు చెందిన కంచర్ల కృష్ణారెడ్డి టీడీపీలో చేరి రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. 2017 నవంబర్ వరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత సోదరుడు భూపాల్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండలో తన సోదరుడు కంచర్ల భూపాల్‌రెడ్డి గెలుపులో కీలక భూమిక పోషించారు. 2018లో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి బాధ్యతలు స్వీకరించారు. 2019లో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో మేళ్లచెర్వు మండల ఇంచార్జిగా, 2021 లో సాగర్ ఉపఎన్నికలో గుర్రంపోడు ఇంచార్జిగా, 2022లో మునుగోడు ఉపఎన్నికలో మర్రిగూడ మండల ఇంచార్జిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం నల్లగొండ పార్లమెంట్ స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. న్యాయ వాది గా, కాంట్రాక్టర్‌గా గుర్తింపుపొందిన కృష్ణారెడ్డి చట్ట సభలో అడుగుపెడతారో? లేదో? చూడాలి మరి.

భువనగిరి

బూర నర్సయ్యగౌడ్

సూర్యాపేట జిల్లా కు చెందిన  బూర నర్సయ్యగౌడ్ ఉస్మానియా మెడికల్  కళాశాలలో చదివి, ఉస్మానియా కళాశాల లో అసిస్టెంట్ సర్జన్ గా పని చేశారు. 2009లో డాక్టర్స్ జేఏసీ స్థాపించి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో టీఆర్‌ఎస్ తరఫున భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీఆర్ ఎస్‌లో జరిగిన పరిణామాలతో ఆ పార్టీని వీడి, బీజేపీలో చేరారు. ప్రస్తుతం భువనగిరి పార్లమెం ట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ పడుతు న్నారు. డాక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన బూర నర్సయ్యగౌడ్.. ఆ తరువాత డాక్టర్స్ జేఏసీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, అనంతరం రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మరోసారి ఎంపీగా గెలుస్తారో? లేదో? చూడాలి మరి.

కిరణ్‌కుమార్‌రెడ్డి

తుంగతుర్తి నియోజక వర్గం శాలిగౌరా రానికి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి.. 2005 2006 వరకు ఆంధ్రప్రదేశ్ యువజన  కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 2007 2008 వరకు  రాహుల్ గాంధీతో కలిసి జాతీయస్థాయిలో పనిచేశారు. 2008 నుంచి- 2009 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా (మహారాష్ట్ర, గోవా, డెహ్రాడూన్  ఇంచార్జి), 2009 నుంచి 2011 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా (తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, పాండిచ్చేరి ఇంచార్జి) పని చేశారు. 2017 2021 వరకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2021 నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నా రు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి.. లోక్‌స భలో అడుపెడతా రా? లేదా? చూడాలి మరి.

క్యామ మల్లేశ్

రంగారెడ్డి జిల్లా శేరిగూడ కు చెందిన క్యామ మల్లేశ్.. ఎన్‌ఎస్‌యూఐ నాయ కుడి గా రాజకీయ జీవితాన్ని ప్రారంభిం చారు. 1988  మధ్యకాలం లో రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్‌లో పనిచేశారు. 1992- ఇబ్రహీంపట్నం వ్యవసా య మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1994 నుంచి 2000 వరకు ఇబ్ర హీంపట్నం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగారు. 2006 నుంచి ౨౦13 వరకు పీసీసీ కార్యదర్శిగా, 2013 నుంచి 2018 వరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగా రు. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2018లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ అభ్యర్థిగా భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు చట్టసభల్లో అడు గుపెట్టని క్యామ మల్లేశ్.. ఈ సారైనా భువనగిరి నుంచి విజయం సాధించి లోక్‌సభలో అధ్యక్షా అంటారో? లేదో? చూడాలి మరి.

ఖమ్మం

తాండ్ర వినోద్‌రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మం డలం తిమ్మంపేటకు చెందిన తాం డ్ర వినోద్‌రావు ఆధ్మాత్మిక, ధార్మిక కార్యక్రమాల నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. వినోద్‌రావు అమెరికాలో డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. మాతృ భూమిపై మమకారం తో, ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఇండియాకు తిరిగివచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూనే  2015 నుంచి 2021 వరకు ఏకలవ్య ఫౌండేషన్ తరఫున విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్వవసా యం వంటి రంగాల్లో సేవలందించారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల అభ్యున్నతికి పాటుపడ్డారు. ప్రస్తుతం వినోద్‌రావు ఖమ్మం పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి బరిలో నిలిచారు.

ఆర్ రఘురాంరెడ్డి

తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రఘురాంరెడ్డి 1985 నుంచి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తు న్నారు. 2011 2013లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యాటరన్‌గా  బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోర్డ్ ఆఫ్ గవర్నెర్స్ వైస్ చైర్మన్‌గా, హైదరాబాద్ రేస్ క్లబ్ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. రఘురాంరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. డోర్నకల్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధి ష్ఠానం రఘురాంరెడ్డిని ఖమ్మం పార్ల మెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో పోటీ చేస్తున్నారు.

నామా నాగేశ్వరరావు

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపా లకి చెందిన నామా నాగేశ్వరరావు 2004లో తొలిసా రి ఖమ్మం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ౨౦౦౯లో టీడీపీ అభ్యర్థిగానే పోటీచేసి గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2018లో మహాకూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. టీడీపీలో పొలిట్‌బ్యూ రో సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి, ౨౦౧౯లో ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ఆ పార్టీకి లోక్‌సభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి బరిలో నిలిచారు.


మహబూబాబాద్


సీతారాంనాయక్


కాకతీయ యూనివర్శి టీ ప్రొఫెసర్ అయి న అజ్మీరా సీతారాంనాయక్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో జేఏసీలో పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ౨౦౧౪లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అదే ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ౨౦౧౯ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. సీతారాంనాయక్ ఇటీవల బీజేపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సీతారాంనాయక్ పేరును అధిష్ఠానం ప్రకటించింది. రెండోసారి పార్లమెంట్‌కు పోటీపడుతున్న ఆయనను ప్రజలు గెలిపిస్తారా? లేదా? చూడాలి మరి.


బలరాంనాయక్


౨౦౦౯లో నియోజకవర్గాల పునర్విభజనతో ఆవిర్భవించిన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ౨౦౧౪ వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ౨౦౧౪ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. ౨౦౧౮ అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ కాం గ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ౨౦౧౯ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం వరించలే దు. ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం బలరాంనాయక్ పేరును ప్రకటించడంతో బరిలో నిలిచారు. కేంద్ర మంత్రి గా పనిచేసిన బలరాంనాయక్ మళ్లీ లోక్‌సభలో అడుగుపెడతారా? లేదా? చూడాలి.


మాలోత్ కవిత


తండ్రి, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ వారసు రా లిగా ౨౦౦౯లో మహబూబాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మాలోత్ కవిత విజయం సాధించారు. ౨౦౧౪లో కాంగ్రెస్ అభ్యర్థిగా మహబూబాబాద్ అసెంబ్లీ  స్థానం నుంచి పోటీచేసి ఓటమిచవిచూశారు. అనంతరం తండ్రి తో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ౨౦౧౮ అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్‌లో తండ్రి రెడ్యానాయక్, మహబూబాబాద్‌లో పార్టీ అభ్యర్థి శంకర్‌నాయక్ విజయానికి కృషి చేశారు. ౨౦౧౯ లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. బీఆర్‌ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతు న్నారు. ప్రస్తుతం పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో పోటీ చేస్తున్నారు.


వరంగల్ అరూరి రమేశ్


జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్లుకు చెంది న అరూరి రమేశ్ 1987లో టీడీపీలో చేరి రాజకీయ జీవి తాన్ని ప్రారంభించారు. తొలుత టీడీ పీ అనుబంధ తెలుగుయువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి 1994లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు. పీఆర్పీ తరఫున స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లోనూ గెలుపొందారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ౨౦౨౩ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరి, ప్రస్తుతం వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.


కడియం కావ్య


కడియం కావ్య.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెద్ద కుమా ర్తె. ఉస్మానియాలో ఎండీ పాథాలజీ చదివారు. తాను చైర్‌పర్సన్‌గా ఉన్న కడియం ఫౌండేషన్ ద్వారా బాలికా విద్యావ్యాప్తి కోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్ధన్నపేట సామాజి క వైద్యకేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే అనేక సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. ౨౦౨౩లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన డాక్టర్ కావ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తన తండ్రి విజయానికి కృషి చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి మొదట బీఆర్‌ఎస్  టికెట్ పొందారు. ఆ తరువాత రాజకీయ పరిణా మాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో ఎంపీగా బరిలో నిలిచారు.


సుధీర్‌కుమార్


కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన మారపెల్లి సుధీర్‌కుమార్ ఆ పార్టీ తర ఫున ఎంపీటీసీగా గెలిచి 1995 2000 వరకు భీమదేవరపల్లి ఎంపీపీగా పనిచేశారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి భీమదేవరపల్లి జెడ్పీటీసీగా విజయంసాధించి, కరీంనగర్ జెడ్పీ వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత భీమదేవరపల్లి హనుమకొండ జిల్లాలో విలీనమైంది. ఎల్కతుర్తి నుంచి జెడ్పీ టీసీగా గెలుపొందారు. హనుమకొండ జెడ్పీచైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆ పదవి సుధీర్‌కుమార్‌కు దక్కింది. ప్రస్తుతం సుధీర్‌కుమార్‌ను బీఆర్‌ఎస్ అధిష్ఠానం వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. సుధీర్‌కుమార్ లోక్‌సభలో అడు గుపెడతారో? లేదో? చూడాలి మరి.


కరీంనగర్


బండి సంజయ్


బండి సంజయ్‌కుమార్ ఏబీ వీపీ కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్య వర్గ సభ్యుడిగా పనిచే శారు. 1994 మధ్యకాలంలో ది కరీంనగర్ కో-ఆపరేటి వ్ అర్బన్ బ్యాంక్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. 2005 నుంచి కరీంనగర్ 48వ డివిజన్ కార్పొరేటర్‌గా మూడుసార్లు గెలిచారు. బీజేపీ కరీంనగర్ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014, ౨౦౧౮ల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా నియమితు లయ్యారు. కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలో నిలిచారు.


వీ రాజేందర్‌రావు


రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వెలిచాల రాజేందర్ రావు -1984 నుంచి 1989 వరకు ఏపీ యువజన కాంగ్రె స్ సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్య దర్శి, ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో సిం గిల్ విండో చైర్మన్‌గా ఉన్నారు. 1991 నుంచి 1994 వరకు స్టేట్ అసోసియేషన్ ఆఫ్ మార్కెట్ కమిటీ చాంబర్ జనరల్ సెక్రటరీగా, 1991 నుం చి 1994 వరకు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004లో చొప్పదండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపో యారు. 2007లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 వరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో కరీంనగర్ లోక్‌సభ నియోజ కవర్గ పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.


బీ వినోద్‌కుమార్


వినోద్‌కుమార్ 14 ఏండ్ల వయసులోనే విద్యార్థి రాజ కీయాల్లోకి అడుగు పెట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐఎస్‌ఎఫ్‌లో చేరారు. కమ్యూని స్టు పార్టీ సభ్యుడిగా చేరి, వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశా రు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. కేసీఆర్ 2001 లో ఏర్పా టు చేసిన టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. 2004లో హనుమకొండ టీఆర్ ఎస్ ఎంపీగా గెలుపొందారు. 2009లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయంసాధించారు. 2019లో ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ తరఫున కరీంనగర్ బరిలో నిలిచారు.


పెద్దపల్లి


గోమాస శ్రీనివాస్


1982 నుంచి కాంగ్రెస్ విభాగం విద్యార్థి నాయకుడిగా పని చేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి పార్లమెం ట్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ టికెట్ దక్కలేదు. దీంతో టీఆర్‌ఎస్ తరఫున పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాలంలో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి టికెట్ ఆశించినా టికెట్ దక్కలేదు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిప్పటికీ గడ్డం వంశీకృష్ణ అభ్యర్థిత్వం ఖరా రు కావడంతో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజే పీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా బరిలో నిలిచారు. ఇప్పటి వరకు చట్ట సభల్లో అడుగుపెట్టని గోమాస శ్రీనివాస్ విజ యం సాధిస్తారో? లేదో? చూడాలి మరి.


గడ్డం వంశీకృష్ణ


గడ్డం వంశీకృష్ణ.. తొలిసారి చట్టసభలకు పోటీపడుతున్నారు. తాత, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి, తండ్రి మాజీ ఎంపీ, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేస్తున్నారు. అమెరికా వర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్, మెనేజ్‌మెంట్ పూర్తిచేశారు. ౨౦౨౩ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరులో తండ్రి వివేక్ గెలుపుకోసం క్రియాశీలకంగా పనిచేశారు. కుటుంబ రాజకీయ వారసుడిగా ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు పోటీపడుతున్న వంశీకృష్ణ.. వృత్తిరీత్య పారిశ్రామిక వేత్త. రాజకీయ అనుభవం లేకపోయినా తాత, తండ్రి రాజకీయ వారసుడిగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా లోక్‌సభలో అడుగుపెట్టి అధ్యక్షా.. అంటారో? లేదో? చూడాలి మరి.


కొప్పుల ఈశ్వర్


బొగ్గుగని కార్మికుడిగా 27 ఏండ్లు పనిచేశా రు. కొప్పుల ఈశ్వర్ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004 లో మేడారం అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2009,  ౨౦౦౮ ఉప ఎన్నికలో, 2010 ఉప ఎన్నికలో, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందా రు. ౨౦౧౪ వరకు చిఫ్‌విప్‌గా, ౨౦౧౮ ౨౦౨౩ వరకు మంత్రిగా పనిచేశారు. ౨౦౨౩ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కొప్పుల మొదటి సారి ఎంపీ గా పోటీ చేస్తున్నారు.


ఆదిలాబాద్


గోడం నగేశ్


తండ్రి రాజకీయ వారసుడిగా గోడం నగేశ్ 1994లో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి బోథ్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గా విజయం సాధించి మంత్రిగా పని చేశారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో బోథ్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఎంపీ గా గెలుపొందారు. 2019లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2024లో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆది లాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. రెండోసారి పార్లమెంట్ లో అడుగుపెడతారా? లేదా? చూడాలి మరి.


ఆత్రం సుగుణ


ఆత్రం సుగుణ.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూ ర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేశారు. రాజకీయాలపై ఆసక్తి నేపథ్యం లో ఈ ఏడాది మార్చి 12న ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివాసీ మహిళా ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా, అరుణోదయ కల్చరల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కో-కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆత్రం సుగుణను ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించడంతో బరిలో నిలిచారు. ప్రజల స్పందన ఎలా ఉంటుందో? చూడాలి.


ఆత్రం సక్కు


ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆత్రం సక్కు 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం లక్ష్మీపూర్‌కు చెందిన  సక్కు 2009లో కాంగ్రెస్ తరఫున ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఆసిఫాబా ద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆసి ఫాబాద్ నుంచి పోటీచేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మిపై 171 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తు న్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన ఆత్రం సక్కు లోక్‌సభలో అడుగుపెడతారో? లేదో? చూడాలి మరి.-----------

నిజామాబాద్

ధర్మపురి అర్వింద్

ధర్మపురి అర్వింద్.. మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ చిన్న కుమారుడు. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన అర్వింద్.. 1995 క్రికెట్ సీజన్‌లో రాష్ట్రం తరఫున ప్రాతినిథ్యం వహించారు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన అర్వింద్ మొదటి సారి ఎంపీగా గెలుపొందారు. ౨౦౨౩లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అర్వింద్ కోరుట్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజ య్ చేతిలో పరాజయం పాలయ్యారు.  ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నిజామాబాద్ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్‌ను ప్రకటించడంతో మళ్లీ పోటీ చేయనున్నారు.

తాటిపర్తి జీవన్‌రెడ్డి

జగిత్యాల జిల్లా పెగడప ల్లి మండలం బత్కెనపల్లికి చెందిన తాటిపర్తి జీవన్‌రెడ్డి న్యాయవాదిగా ఉం టూ 1981లో మల్యాల పంచాయ తీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికై రాజకీయల్లోకి ఆడుగుపెట్టారు. జీవన్‌రెడ్డి తొలిసారి 1983లో టీడీపీ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984లో  కాంగ్రెస్‌లో చేరి 1989, 1996, 1999, 2004, 2014 ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్, నాదేండ్ల భాస్కర్‌రావు, వైఎస్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 2019లో విద్యావంతుల నియోజకవర్గ  ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. 2006, 2009లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ నిజా మాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది.

బాజిరెడ్డి గోవర్ధన్

1973లో పోలీస్ పటేల్‌గా జీవితాన్ని ప్రారంభించిన బాజిరెడ్డి గోవర్ధన్, 1981లో చిమాన్‌పల్లి సర్పంచ్‌గా, 1986లో సిరికొండ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1986లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1999లో ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో బాన్స్‌వాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధిం చారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి, 2014, 2018 లో నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్టీసీ చైర్మన్‌గానూ పనిచేశారు. 2023లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపో యారు. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

మెదక్

రఘునందన్‌రావు

సిద్దిపే ట జిల్లా దుబ్బాక ప్రాంతానికి చెందిన మాధవనేని రఘునందన్‌రావు న్యాయవాదిగా స్థిరపడ్డారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, మెదక్ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. 2013లో ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి కొద్దిరోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2014లో దుబ్బాక అసెం బ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2020లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొం దారు. ౨౦౨౩ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీపడుతున్నారు.

నీలం మధు

పటాన్‌చెరు మండలం చిట్కుల్‌కు చెందిన నీలం మధు 2006 లో చిట్కుల్ పంచాయతీ వార్డు సభ్యుడి గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించా రు. 2014లో గ్రామ ఉపసర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టడంతోపాటు అదే ఏడాది జడ్పీటీసీ ఎన్నికల్లో పటాన్‌చెరు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 స్థానిక సర్పం చ్ ఎన్నికల్లో జనరల్ స్థానం నుంచి చిట్కుల్ గ్రామానికి సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. ౨౦౨౩ శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పటా న్‌చెరు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. టికెట్ రాకపోవడంతో బీఎస్పీలో చేరి పటాన్‌చెరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ౨౦౨౪లో కాంగ్రె స్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మెదక్ పార్లమెంట్ స్థానానికి నీలం మధు పేరును ప్రకటించడంతో బరిలో నిలిచారు.

పీ వెంకట్రామిరెడ్డి

పెద్దపల్లి జిల్లా ఇందుర్తికి చెందిన పరుపాటి వెంకట్రామిరెడ్డి 1996లో గ్రూప్ ఉద్యోగం సంపాదిం చి బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవో గా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా డ్వామా పీడీగా, ఆ తర్వాత హుడా సెక్రటరీగా, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా పనిచేశారు. 2007లో ఐఏఎస్ హోదా పొంది 2015 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2016లో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాలపై ఆసక్తితో 2021లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 2021లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పార్ల మెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

జహీరాబాద్

బీబీ పాటిల్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని శిర్పూర్ గ్రామానికి చెందిన బీబీ పాటిల్.. వృత్తిరీత్యా వ్యవసాయంతోపాటు వ్యాపారం చేస్తుండేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో (తెలంగాణ రాష్ట్ర సమితి) టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌పై విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మరోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై ౬ వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బీబీ పాటిల్.. ౨౦౨౩ అసెంబ్లీ ఎన్నికల తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి రాజీనామా చేసి బీజేపీ (భారతీయ జనతా పార్టీ)లో చేరారు. ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

సురేశ్ షెట్కార్ 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన సురేశ్ షెట్కార్.. 1991 98 వరకు మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 2002 08 వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2002లో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ తరఫున జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సురేశ్ షెట్కార్ కేంద్రంలో రసాయన, ఎరువుల కమిటీ సభ్యుడిగా పని చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి పోటీ చేసినా, టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ చేతిలో ఓటమి చవిచూశారు. ౨౦౧౮ అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగినా, టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడుతున్నారు.    

గాలి అనిల్‌కుమార్

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన గాలి అనిల్‌కుమార్ 2001లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పని చేశారు. 2009లో పటాన్‌చెరు టీఆర్‌ఎస్ ఇంచార్జిగా నియమితులయ్యారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన 65వ జాతీయ రహదారి నిర్బంధం, రైల్‌రోకో వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2018 శాసన సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో 2019లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతిలో ౩,౧౬,౪౨౭ ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2023 శాసన సభ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టీకెట్ కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం జహీరాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.